telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కర్ణాటకలో రెండువారాల లాక్ డౌన్…

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10 గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని తెలిపింది. లాక్ డౌన్ రోజుల్లో వ్యవసాయ రంగాలు, నిర్మాణ రంగాలు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత కరోనా కేసులు ఎక్కువగా కర్ణాటకలో నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ వేస్తున్న రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. చూడాలి మరి ఇంకా ఏ ఏ రాష్ట్రాలు ఈ నిర్ణయూన్ని తీసుకుంటాయి అనేది.

Related posts