telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది ఐపీఎల్ లో అతనే అత్యంత ఖరీదైన ఆటగాడు : చోప్రా

గత ఏడాది కరోనా కారణంగా ఆలస్యంగా జరిగిన ఐపీఎల్ 2020 విజయవంతమైన విషయం తెలిసిందే. ఆ కారణంగా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 2021 వేలం వచ్చే నెలలో నిర్వహించాలి అని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇక అందుకోసం నిన్న అన్ని జట్లు తమ వెంట ఉంచుకునే ఆటగాళ్ల జాబితాను అలాగే వదిలిపెట్టే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై మాజీ ఆటగాడు ప్రస్తుతం వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మాట్లాడుతూ… ఈ ఐపీఎల్ వేలంలో ఎవరెంత ధర పలుకుతారో చెప్పాడు. గత ఏడాది ఐపీఎల్ నుండి తప్పుకొని తాజాగా జరిగిన భారత్-అసైన్ సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఈ ఫిబ్రవరిలో జరిగే వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారవచ్చని చోప్రా చెప్పాడు. అలాగే పంజాబ్ విడుదల చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ 7 నుంచి 8 కోట్లు మరియు ఢిల్లీ విడిచి పెట్టిన జాసన్ రాయ్ 4-6 కోట్లు పలుకుతారని చోప్రా తెలిపారు. అంతే కానుండా  ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్లెన్ మాక్స్వెల్, నాథన్ కౌల్టర్-నైలు, కామెరాన్ లు మంచి ధర పలుకుతారాలి విశ్వసం వ్యక్తం చేసాడు చోప్రా. చూడాలి. మరి వచ్చే నెలలో వేలం జరిగినప్పుడు ఆకాష్ చోప్రా యొక్క ఎన్ని అంచనాలు సరైనవని చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Related posts