telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తాము : పెద్దిరెడ్డి

Peddireddy

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ విగ్రహాల ధ్వంసం పై రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని.. లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నామన్నారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర ఇది అని.. ఎస్ఈసీ అధికారులతో సమావేశం పెట్టుకోవచ్చు… మాకేం అభ్యంతరం లేదని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? సవాల్‌ విసిరారు. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు తాడేపల్లిలో జరిగిన ఉపాధి హామీ రాష్ట్రస్థాయి సమీక్షా లో ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ఎక్కువ కుటుంబాలకు ‘ఉపాధి’ పనులు కల్పించిన రెండో రాష్ట్రం ఏపీ అని… సకాలంలో కూలీలకు వేతనాల చెల్లింపులో రాష్ట్రం ప్రథమస్థానం అని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో గత ఏడాది జూన్‌ 8న ఒకేరోజు 54.42 లక్షల మందికి పని కల్పించి కొత్త రికార్డు సృష్టించామని.. వేతనాల చెల్లింపు ప్రక్రియ (డిబిటి) ద్వారా రూ.5.1 కోట్లు చెల్లించామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రానికి తిరిగి వచ్చిన 15 లక్షల మందికి ‘ఉపాధి’ కల్పించామని.. ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన పనిదినాలు 25.25 కోట్లు అని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు వేతనదారులకు కల్పించిన పనిదినాలు 22.44 కోట్లు అని… మిగిలిన రెండు నెలల్లో మరో 5 కోట్ల పనిదినాలు కల్పిస్తామని అంచనా వేశారు మంత్రి పెద్దిరెడ్డి. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts