telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా పేషెంట్ల‌కు ఎలుగుబంటి పైత్యరసం!

Bear corona

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనాలో మాత్రం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికీ కొవిడ్-19 కేసులు నమోదువుతున్నా, కొన్ని వారాల కిందట ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదు. అయితే తాజాగా ఆ దేశ ప్ర‌భుత్వం ఓ కొత్త ఆదేశం జారీ చేసింది. క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న కోవిడ్‌19 పేషెంట్ల‌కు ఎలుగుబంటి పైత్య‌ర‌సాన్ని కూడా ఇవ్వ‌వ‌చ్చు అని పేర్కొన్న‌ది. వైర‌స్ సోకిన పేషెంట్ల‌కు టాన్ రీ కింగ్ ఇంజెక్ష‌న్ ఇవ్వ‌వ‌చ్చు అని ఆ దేశ జాతీయ హెల్త్ క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న చేసింది.

అయితే టాన్ రీ కింగ్ ఇంజెక్ష‌న్‌లో ఎలుగుబంటి పైత్య‌ర‌సంతో పాటు మేక కొమ్ముల ర‌సం, మ‌రికొన్ని మూలిక‌ల ర‌సం క‌ల‌గిలిపి ఉంటుంది. చైనాలో పురాతన వైద్యవిధానంలో భాగంగా టాన్ రీ కింగ్ అనే ఔషధాన్ని క్లిష్ట పరిస్థితుల్లో వినియోగిస్తుంటారు. చైనా ప్రభుత్వం నిర్ణయం పట్ల అక్కడి జంతు హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల మనుగడకు ఇలాంటి నిర్ణయాలతో ముప్పు వాటిల్లుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Related posts