telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

టిక్ టాక్ కు పోటీగా భారతీయ యాప్… నెలరోజుల్లోనే 50 లక్షల డౌన్ లోడ్స్

Mitron

టిక్ టాక్ కు పోటీగా రూపొందించిన భారతీయ యాప్ మిత్రోన్ వినియోగదారుల ఆదరణను విశేషంగా చూరగొంటుంది. ఈ యాప్ విడుదలై నెల రోజులు అవుతుంది. ఇంతలోనే 50 లక్షల డౌన్ లోడ్స్ మార్కును ఈ యాప్ దాటింది. ప్రస్తుతం మనదేశంలో టిక్ టాక్ ఎన్నో సమస్యలను, వివాదాలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. రివ్యూల్లో కూడా కొంతమంది ‘ఎన్నో లోపాలున్నాయి. ఎన్నో ఫీచర్లు ఇందులో లేవు. కానీ భారతీయ యాప్ కాబట్టి మద్దతిస్తున్నాం’ అని చెప్తూ రేటింగ్ ను కూడా ఎక్కువగా ఇస్తున్నారు. ఈ యాప్ ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించినట్లు తెలుస్తోంది. సరిగ్గా చూస్తే ఈ యాప్ టిక్ టాక్ కు డూప్లికేట్ వెర్షన్ లా ఉంటుంది. గూగుల్ ప్లే చార్ట్ లో ఫ్రీ యాప్స్ జాబితాలో మిత్రోన్ 12వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆరోగ్య సేతు మొదటి స్థానంలో, టిక్ టాక్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ యాప్ లో కొత్తదనం ఏమీ అంతగా లేకపోయినా.. దీని పేరు నరేంద్రమోదీ ఎక్కువగా ఉపయోగించే పదం కావడం, టిక్ టాక్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండటం దీనికి బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఈ యాప్ తనకు వచ్చిన పాపులారిటీని నిలబెట్టుకుంటుందా లేదా అనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది. దీని రేటింగ్ 4.7గా ఉంది. అయితే రివ్యూల్లో ఉన్న కంటెంట్ లో మాత్రం విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. ఈ యాప్ ను రూపొందించిన డెవలపర్ దీనికి సంబంధించిన లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దితే ఈ యాప్ మనదేశంలో ఎంతో పాపులర్ అయ్యే అవకాశం ఉంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేస్తే దీని యూజర్ ఇంటర్ ఫేస్ చూడటానికి టిక్ టాక్ తరహాలోనే ఉంది. ఇందులో ఉన్న కంటెంట్ కూడా టిక్ టాక్ కంటెంట్ లాగానే ఉంది. కొన్ని వీడియోల మీద టిక్ టాక్ లోగోను కూడా మీరు చూడవచ్చు. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో లేదు.

Related posts