telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

వ్యభిచార గృహంపై దాడి.. జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

ARREST crime

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాట్‌ పై పోలీసులు దాడి చేసి  జూనియర్ ఆర్టిస్టును అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కిరణ్, అశ్వారావుపేటకు చెందిన ఇంటి పవన్‌ (24)లు తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ అర్టిస్టులుగా పనిచేస్తున్నారు.

జూనియర్ ఆర్టిస్టుగా వచ్చే సంపాదన సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకున్నారు. ఖైరతాబాద్ రాజ్‌నగర్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఫ్లాట్‌పై దాడి చేసి పవన్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts