telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు షాక్‌ … ఒక్కో బస్తాపై రూ. 700 పెంపు

మన దేశంలో ఇప్పటికే నిత్యవసర ధరలన్నీ… పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌ కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళో, రేపో ఏపీలోనూ పెట్రోల్‌ సెంచరీ కొట్టేయనుంది. అటు వంటగ్యాస్‌ గురించి చెప్పనక్కర్లేదు. గడిచిన మూడు నెలల్లోనే రూ.225 పెరిగింది. ఇక ఇప్పుడు రైతులు వంతు వచ్చేసింది. రైతులు ప్రధానంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసంగా రూ. 450 పెంచాయి. పెరిగిన ధరలను ఇఫ్కో కంపెనీ బుధవారం ప్రకటించింది. డీఏపీ ధర అత్యధికంగా రూ. 1900 గా నిర్ణయించింది. ప్రస్తుతం దీని ధర రూ. 1200 ఉండగా.. ఏకంగా రూ.700 పెంచింది. కాంప్లెక్స్‌ ఎరువులకు సంబంధించి కనీసం రూ. 450 పెంచింది. యూరియా ధర నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉండటం ప్రస్తుతానికి ధర పెరుగలేదు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి అవరసరమైన ముడిసరుకు ధర పెరగడమే ఎరువుల ధర పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి. ఏదీ ఏమైనా.. ఎరువుల పెరుగుదలతో రైతులపై ఈ భారం భారీగా పడనుంది.

Related posts