telugu navyamedia
సినిమా వార్తలు

శంకర్ తరువాత హీరో హృతిక్ రోషన్ ?

Shankar,Hrithik Roshan
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ప్రముఖ దర్శకుడు శంకర్. తన సినిమాల్లో బలమైన కథాకథనాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. ప్రస్తుతం శంకర్ “భారతీయుడు-2” చిత్రం పనులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమా కార్యక్రమాలు ఆగిపోయాయి.
ఎన్నికల తరువాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత శంకర్ సినిమా ఏ హీరోతో ఉండబోతుందా ? అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో మొదలైంది. అయితే శంకర్ తన తరువాత సినిమా హీరో హృతిక్ రోషన్ తో ఉండబోతోందని కోలీవుడ్ టాక్. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ గా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా విషయమై శంకర్ ఇప్పటికే హృతిక్ రోషన్ ను సంప్రదించాడని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts