telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీ బర్త్‌ డే: నారప్ప టీం అదిరిపోయే గిఫ్ట్‌

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌ గా రూపొందుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకుంటే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. వెంకటేష్ అభిమానులు ‘నారప్ప’ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే…తాజాగా ఈ సినిమా గ్లిమ్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. విక్టరీ వెంకటేశ్‌ బర్త్‌ డే కానుకగా ఈ సినిమా గ్లిమ్స్‌ను రిలీజ్‌ చేశారు. 

Related posts