telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ గ్రామ సచివాలయంలో సీఎం జగన్ స్థానంలో ఎన్టీఆర్ ఫోటో… వివాదాస్పదం

NTR

కృష్ణా జిల్లాలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ రంగులు వేశారు. అయితే, సాక్షి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆ భవనానికి పసుపు రంగు వేశారు. అదీకాక భవనంపై గీసిన సీఎం జగన్ ఫోటో స్థానంలో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను అతికించారు. దీంతో ఆ ఘటన రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో 17మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వాలు మారినకొద్దీ గ్రామ సచివాలయాలకు, ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చుతున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తమ పార్టీ రంగును లేక, ప్రతిపక్ష పార్టీ రంగులు కనిపించకుండా వేరే రంగులు వేయించడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఏపీలో టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పసుపు రంగు వేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తనకు ఇష్టమైన రంగులు వేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts