telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గోనగన్నా రెడ్డి”గా బాలయ్య

NBK

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ చారిత్రాత్మక వీరుడి పాత్రలో నటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన గోన గన్నారెడ్డి అనే చారిత్రక వీరుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తర్వాత బాలయ్య ‘గోన గన్నారెడ్డి’ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలో గోన గన్నారెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడు. గుణశేఖర్-అనుష్క కాంబినేషన్లో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘నేను తెలుగు భాష లెక్క ఈడా ఉంటా.. ఆడా ఉంటా, గమ్మనుండవయ్యా.. అంటూ బన్నీ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చారిత్రక పాత్రలో బన్నీని బాలయ్య మరిపిస్తారో? లేదో? చూడాలి. ఇప్పటికే బాలకృష్ణ తన 100వ చిత్రం కలకాలం గుర్తిండిపోవాలన్న ఉద్దేశంతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి అద్భుతమైన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Related posts