telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

సీల్ చేపకు నిద్రాభంగం కలిగించిన స్మగ్లర్లు… అదేం చేసిందంటే ?

Seal

ఫ్రాన్స్‌కు చెందిన ఆంటోనీ డిసెంటా (51), బ్రిటన్‌కు చెందిన గ్రాహం పామర్ (34) పశ్చిమాస్ట్రేలియాలోని ఓ దీవికి వచ్చారు. వీరిద్దరూ అంతర్జాతీయంగా మాదకద్రవ్యాలు స్మగుల్ చేసే ముఠాసభ్యులు. అమ్మకానికి తమతోపాటు తీసుకొచ్చిన డ్రగ్స్‌ను ఆ దీవిలో దాచారు. వారు చేసిన చప్పుళ్లకు ఆ పక్కనే నిద్రిస్తున్న ఓ సీల్ చేపకు మెలకువ వచ్చింది. తనకు నిద్రాభంగం చేసినందుకు దానికి విపరీతమైన కోపం వచ్చింది. తాము వచ్చిన డింగీ కోసం వెళ్లబోతున్న స్మగ్లర్ల దారికి అడ్డుగా కూర్చుంది. వారివైపు గుర్రుగా చూడసాగింది. ఇంతలో పెట్రోలింగ్ కోసం ఆస్ట్రేలియన్ అధికారుల బోట్లు అటుగా వచ్చాయి. దీంతో స్మగ్లర్లు భయపడిపోయారు. సీల్ చేపతో పోరాడడంకె అన్నా పోలీసులకు లొంగిపోవడమీ మేలని నిర్ణయించుకున్నారు వారిద్దరు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… వీరి నుంచి 6 లక్షల 88 వేల డాలర్ల (సుమారు రూ.5కోట్లు) విలువచేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంటోనీ, గ్రాహమ్‌ అరెస్టయిన కొద్దిసేపటికి.. వారి నుంచి డ్రగ్స్ కొనాల్సిన మరో ముగ్గురు అక్కడకొచ్చారు. అక్కడే మాటువేసి ఉన్న పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. ఇదో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అన్న అధికారులు.. ఈ డ్రగ్స్ ఎక్కడకు తీసుకెళ్లనున్నారో ఇంకా తెలియదని, కానీ వీటివల్ల కొన్ని వందలమంది జీవితాలు నాశనమయ్యేవని పేర్కొన్నారు. ఈ దొంగలు దొరికిపోవడానికి కారణమైన సీల్‌ చేపకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts