telugu navyamedia
సినిమా వార్తలు

సాగర్, బాబు మోహన్ , భగీరథకు డెక్కన్ వుడ్ జీవిత సాఫల్య పురస్కారాలు

సహారా మేనేజ్మెంట్ సారధ్యంలో డెక్కన్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది , ప్రతి సంవత్సరం తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తుందని చైర్మన్ డాక్టర్ చౌదరి వడ్లపట్ల తెలిపారు . శనివారం రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రంలో డాక్టర్ చౌదరి వడ్లపట్ల మాట్లాడుతూ ఇప్పటికే ఇద్దరు దర్శకులతో రెండు సినిమా లను నిర్మించడానికి సంకల్పించామని , 2021 సంవత్సరానికి డెక్కన్ వుడ్ సినీ అవార్డుల ప్రదానం వచ్చే ఉగాది రోజు నిర్వహించ బోతున్నామని ఆయన తెలిపారు.


డెక్కన్ వుడ్ సినీ అవార్డుల కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించబోతున్నామని , ఈ అవార్డుల కమిటీకి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ , రచయిత , కవి భగీరథ గారిని ఎంపిక చేశామని వడ్లపట్ల చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు సాగర్ , సీనియర్ నటుడు బాబు మోహన్, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను జీవిత సాఫల్య అవార్డులతో సత్కరించారు . కార్యక్రమానికి పలువురు నటీనటులు, దర్శకులు హాజరయ్యారు.


ఈ సందర్భగా నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ . ఇప్పటికే హైదరాబాదీ సినిమాలు వచ్చాయని, అవి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయని , ఇప్పుడు డెక్కన్ వుడ్ సంస్థ నిర్మాణ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు . తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందిస్తామని కూడా వీరు పేర్కొనడం ఆనందంగా ఉందని , ఈ అవార్డుల కమిటీకి నేషనల్ అవార్డుల జ్యూరీ , సభ్యుడుగా , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారిని చైర్మన్ గా నియమించడం కూడా సముచితంగా ఉందని ప్రసన్న కుమార్ తెలిపారు


దర్శకులు సాగర్ మాట్లాడుతూ – చిత్ర నిర్మాణంలో ఎన్నో మార్పులు వచ్చాయని , ఒకప్పుడు సినిమాలను నిర్మించడం అంటే ఒక యజ్ఞం లా ఉండేదని , అయితే డిజిటల్ యుగంలో నిర్మాణం చాలా తేలికై అందరికీ అందుబాటులోకి వచ్చిందని , చౌదరి వడ్లపట్ల సారధ్యంలో సహారా గ్రూప్ చైర్మన్ మహమ్మద్ తస్కిన్ సినిమాలను నిర్మించడానికి ముందుకు రావడం హర్షణీయమని చెప్పారు .

నటులు, భారతియ జనతా పార్టీ నాయకుడు బాబూ మోహన్ మాట్లాడుతూ – ఈరోజు వేదికపై ఇంతమంది సినిమా వాళ్ళను చూస్తుంది నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి , సినిమా రఁగంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు వున్నాయ్ , నాకు వడ్లపట్ల బ్రదర్స్ తో చాలా సంవత్సరాల నుంచి పరిచయం వుంది , అందుకే చౌదరి గారు ఆహ్వానించగానే ఈ కార్యక్రంలో పాల్గొన్నాను . ఈ సంస్థకు నా శుభాకాంక్షలు అని చెప్పారు .

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ మాట్లాడుతూ . చౌదరి గారితో కలసి మహమ్మద్ తస్మిన్ తెలుగులో చిత్రాలు నిర్మించడం అందరికీ ఆనందం కలిగించే విషయమని , ఈ సంస్థ కొత్త దర్శకులను కూడా పరిచయం చేస్త్తామని ప్రకటించడం మంచి ఆలోచనని చెప్పారు . ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు సినిమాలకు అవార్డులను ఇవ్వడం లేదని , ఇలాంటి పరిస్థితుల్లో సహారా డెక్కన్ వుడ్ సినిమా అవార్డులను ఇవ్వాలని సంకల్పించడం , ఆ కమిటీకి నన్ను చైర్మన్ గా ఎంపిక చెయ్యడం పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని , వారికి ఈ సందర్భగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు .

ఈ కార్యక్రంలో పాల్గొన్న చిత్ర పురి కాలనీ కార్యదర్శి కాదంబరి కిరణ్ ,కుమార్ , నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల , సంపూర్దేశ్ బాబు, పృద్ద్వీ , గౌతమ్ రాజు , నటి రమ్యశ్రీ , కోట శంకర్ రావు పాల్గొన్నారు . అందరినీ చౌదరి వడ్లపట్ల , మహ్మద్ తస్మిన్ సత్కరించారు .

Related posts