జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న “డ్రీమ్‌గర్ల్” ట్రైలర్ విడుదలైంది. కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న హీరో ఆడ గొంతుతో కస్టమర్లకు కిక్ ఎక్కిస్తున్నాడు. “డ్రీమ్‌గర్ల్” లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఆయుష్మాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు. అన్నూ కపూర్, నుష్రత్ బరూచా కూడా ఈ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. పూజ అనే అమ్మాయి పేరుతో హీరో ఆడగొంతుతో మాట్లాడుతూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాడు. యూపీలోని మథురలో ఫిల్మ్ షూటింగ్ జరిపారు. రాజ్ శాండిల్య దీన్ని డైరక్ట్ చేస్తున్నాడు. గత ఏడాది అందాధున్, బదాయి హోలతో హిట్ కొట్టిన ఆయుష్మాన్ ఈ ఏడాది కూడా ఆర్టికల్ 15తో ఊపుమీద కనిపించాడు. ఇక ఇప్పుడు “డ్రీమ్‌గర్ల్” అతని స్టార్‌డమ్‌ను మరింత పెంచేలా ఉంది. కామెడీ కథా నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా మరోసారి ఆయుష్మాన్‌కు పెద్ద హిట్ ఇచ్చేలా ఉన్నది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్