telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 తెలుగు : .. రేటింగ్ తేలేకపోతున్న .. కొత్త సభ్యులు ..

star maa promo on bigg boss 3

ఇప్పటివరకు 6ఎలిమినేషన్లు జరుగగా ఈరోజు మరో ఎలిమినేషన్ జరగనుంది. ఆ ఎలిమేనట్ అయ్యేదెవరో ఈపాటికే అందరికి తెలిసిపోయుంటుంది. ఇంకెవరు హౌజ్ లోకి రెండవ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్పా చక్రవర్తి. ఆమె గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడం అలాగే రావడం రావడమే హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్ ను టార్గెట్ చేయడంతో ప్రేక్షకులు ఆమె కు ఓట్లు వేయడానికి ఇష్టపడలేదు. దాంతో అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా శిల్పా ఈరోజు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లనుంది.

గత రెండు సీజన్ల తో పోలిస్తే ఈసీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీ సప్పగా సాగింది. మొదటి సీజన్ లో హీరో నవదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అద్భుతమైన గేమ్ ప్లాన్ తో ఫైనల్ వరుకు వెళ్ళాడు. ఆయన ఎంట్రీ షో కు మంచి ఊపు తెచ్చింది. ఆ తరువాత సీజన్ లో పూజా రాంచంద్రన్ కూడా మిగితా కంటెస్టెంట్ లకు గట్టి పోటీనిచ్చింది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు వైల్డ్ కార్డు ఎంట్రీ లు జరుగాయి. అందులో మొదటగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం లోనే నామినేషన్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వగా రెండు వారాల క్రితం రెండు వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన శిల్పా చక్రవర్తి కూడా మొదటి సారి నామినేషన్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వనుంది. అలా ఈరెండు ఎంట్రీ లు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Related posts