టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం హైద్రాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మనకు ఎవరితోనూ పోటీ లేదని, సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలను మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని కేసీఆర్ చెప్పారు.