telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాహనదారులకు శుభవార్త… ఇక ఇంటి నుంచే అన్ని సేవలు

డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం రిజిస్ట్రేషన్‌ వంటి సేవలను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఆధార్‌ ఆథెంటికేషన్‌ ద్వారా కాంటాక్ట్‌లెస్‌ సర్వీసులను అందజేయాలని నిర్ణయించింది. 18 సేవలను ఆన్‌లైన్‌నే పొందడానికి ప్రజలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ గురువారం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రభుత్వ సేవల బట్వాడా ప్రక్రియలను సరళితరం చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్‌ లో పేర్కొంది. 18 సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని తెలిపింది. డ్రైవింగ్‌ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ లాంటి సేవలను ఆధార్‌ ఆథెంటికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే పొందవచ్చునని పేర్కొంది. ఈ కాంటాక్ట్‌లెస్‌ సేవలు అందరికీ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.

Related posts