telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నది అడుగున కన్పించిన ఐఫోన్… ఛార్జింగ్ పెట్టి చూడగా…!

Iphone

వాషింగ్టన్ లో మైఖేల్ బెన్నెట్ అనే యూట్యూబర్ నీళ్లలో మునిగిపోయిన విలువైన వస్తువుల కోసం గాలిస్తంటాడు. దానికి సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో పెడుతుంటాడు. తన పనిలో భాగంగా ఇటీవలే సౌత్ ‌కరోలినాలోని ఎడిస్టో నదిలో దిగాడు. ఆ నది అడుగున అతనికో వస్తువు కనిపించింది. ఏంటా అని చూస్తే అదో ఐఫోన్. దాన్ని చూడగానే అది నదిలో పడిపోయి చాలారోజులైందని మైఖేల్‌కు అర్థమైంది. పని చేస్తుందో లేదో అనే అనుమానంతోనే దాన్ని బయటకు తీసుకొచ్చి చార్జింగ్ పెట్టాడు. అయితే ఆ ఫోన్ అతని అంచనాలను తారుమారు చేస్తూ ఆనయింది. దీంతో ఆశ్చర్యపోయిన మైఖేల్… అది ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఐఫోన్ సెక్యూరిటీ ఫీచర్స్ చాలా కఠినంగా ఉండటంతో ఆ పని అతనివల్ల కాలేదు. చివరకు ఆ ఫోన్లోని సిమ్‌కార్డు తీసి వేరే ఫోన్లో వేసి, దాని యజమాని వివరాలు కనుగొన్నాడు. అది ఎరికా అనే ఓ అమ్మాయిదని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను కలిసి ఫోన్ అందించాడు. ఆ ఫోన్లోలో చనిపోయిన తండ్రితో తన సంభాషణలున్నాయని, అవన్నీ పోయాయని చాలా బాధపడ్డానని ఆమె చెప్పింది. 2018 జూన్‌లో నదిలో పడిపోయిన ఆ ఫోన్ తెచ్చి ఇచ్చినందుకు మైఖేల్‌కు ధన్యవాదాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను మైఖేల్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనికి వీక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ విషయంలో స్థానికంగా ఉండే ఓ న్యూస్‌ఛానెల్ కూడా మైఖేల్‌ను ఇంటర్వ్యూ చేసింది.

Related posts