telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

24 ఏళ్ళ యువకుడు… 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు…!?

Ukrain

ఒక ఉక్రేనియన్ యువకుడు తన పెళ్లి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు. అయితే ఆ యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఉక్రెయిన్‌లో ఆ దేశ పౌరులకు కొంతకాలం నిర్భంద సైనిక శిక్షణ అనేది తప్పనిసరి. దీని నుంచి తప్పించుకోవడానికి అలెగ్జాండర్ కొండ్రాట్యుక్ (24) అనే యువకుడు తన బంధువైన జినైడా ఇల్లారియోనోవ్నా (81) అనే వృద్ధురాలిని వివాహం చేసుకున్నాడు. అలెగ్జాండర్ ఇలా ఎందుకు చేశాడంటే… ఆ దేశ పౌరులకు నిర్భంద సైనిక సేవ తప్పనిసరి. ఒకవేళ భార్య ఏదైనా వైకల్యంతో ఉంటే సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ లొసుగునే మనోడు వాడుకున్నాడు. తన భార్య జినైడాకు వయో భారంతో పాటు కంటిచూపు సరిగ్గాలేదని ధృవపత్రాలు కూడా సృష్టించుకున్నాడు. ఇక అధికారులు అలెగ్జాండర్‌ను సైనిక సేవ గురించి అడిగితే మ్యారెజ్ సర్టిఫికేట్‌ చూపిస్తున్నాడట. భార్య జినైడాను అడిగితే భర్త అలెగ్జాండర్‌ తనను బాగా చూసుకుంటున్నాడని చెబుతుందట. దాంతో సైనికాధికారులు కిమ్మనకుండా వెళ్లిపోతున్నారు. ఇక సైనిక సేవ నుంచి తప్పించుకోవడానికి దేశ పౌరులు అలెగ్జాండర్‌‌ను అనుసరిస్తే పరిస్థితి ఏంటని ఆ దేశ సైనికాధికారులు ఆలోచనలో పడ్డారట.

Related posts