telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మైనంపల్లికి చేదు అనుభవం…రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ నినాదాలు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డు వేస్తేనే మేము ఓటు వేస్తామని యాప్రాల్ లో స్థానికులు రోడ్డెక్కి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ను ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ అడ్డగించారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు స్థానికులతో చర్చించారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే తన సొంత నిధులతో రోడ్లు బాగు చేస్తానని వాగ్దానం చేసి తన లెటర్ పాడ్ పై సంతకం చేసి స్థానికలకు అందజేశారు. దీంతో స్థానికులు ప్రభుత్వానికి మేము టాక్స్ కడుతున్నామని… మీసొంత నిధులు మాకు అక్కరలేదని అన్నారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి త్వరలోనే రోడ్లు వేస్తామని.. స్థానికులతో ధర్నా విరమింప చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts