telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్ష్మీ బాంబ్ ట్రైలర్‌పై ఆమిర్ ఖాన్ ప్రశంసలు..

Laxmi-Bomb

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ ట్రైలర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే అన్ని సామజిక మాధ్యమాల్లో ఈ ట్రైలర్ అత్యధికంగా వీక్షించబడిన ట్రైలర్ గా రికార్డు నెలకొల్పింది.

ఒక్క యూట్యూబ్ నుంచి ఈ ట్రైలర్ కు 38 మిలియన్ వ్యూస్ రాగా మిగతా సామాజిక మాధ్యమాలతో కలిపి మొత్తం 70 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే మన ఇండియన్ సినిమాలో రికార్డ్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై అమిర్ ఖాన్ కూడా ప్రసంశలు కురిపించారు. డియర్ అక్షయ్ కుమార్, ట్రైలర్ అద్భుతంగా ఉంది..సినిమా చూడాలనే ఉత్సహంతో ఉన్నాను అంటూ ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావాలని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నాడు. మీ చిత్ర బృందానికి నా అభినందనాలు అంటూ ట్వీట్ చేసాడు.

Related posts