telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడిపై తెలంగాణ సర్కార్ దూకుడు.. కీలక నిర్ణయాలు ఇవే

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఓపి నిర్వహణకు చేసిన ఏర్పాట్ల విషయమై తెలుసుకున్నారు. రెగ్యులర్ సర్వీసులను హెల్త్ సెంటర్ లో అందిస్తూ కోవిడ్ ఓపి సర్వీసులను సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్నామని డాక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. రద్ధీ నివారణకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మందుల కిట్ ను అందించి చికిత్సను ప్రారంభించాలన్నారు. మందులు వాడాకా జ్వరం నాలుగు, ఐదు రోజుల పాటు ఉంటే స్టిరాయిడ్ ను వాడాలని దీనివలన ఆసుపత్రులలో చేరికను నివారించడం జరుగుతుందన్నారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో ఓపి చికిత్సకు హాజరై, ఉచితంగా అందజేసే మందులను వాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. జ్వర లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు, సూచనలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పరిశీలించారు.

Related posts