telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తున్న “విజయ్”… మూడవసారి 200 కోట్ల క్లబ్బులో విజయ్

Bigil

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం బిగిల్‌. తెలుగులో విజిల్ పేరుతో ఈ చిత్రం విడుద‌లైంది. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. విజయ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా మంచి విజయం దిశగా అడుగులేస్తుంది. ఈ చిత్రం 5 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది. వరసగా మూడోసారి ఈయన నటించిన సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. ఇదే అట్లీ దర్శకత్వంలో 2017 దివాళికి విడుదలైన మెర్సల్ సినిమాతో తొలిసారి 200 కోట్ల ఫీట్ అందుకున్నాడు దళపతి విజయ్. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన తర్వాత గతేడాది దివాళికి సర్కార్ సినిమాతో వచ్చాడు. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా 200 కోట్లతో రప్ఫాడించాడు. ఇక ఇప్పుడు బిగిల్ సినిమాతో వరసగా మూడోసారి 200 క్లబ్బులో చేరిపోయాడు విజయ్. సౌత్ ఇండియాలో రజినీకాంత్, ప్రభాస్ తర్వాత వరసగా మూడుసార్లు 200 కోట్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించాడు విజయ్. తొలిరోజే బిగిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో యావరేజ్ టాక్‌తో మొదలైనా కూడా ఇక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది విజిల్. ఇక తమిళనాట కార్తి ఖైదీ సినిమా పోటీగా ఉన్నా కూడా కనీసం విజయ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు కార్తి. 5 రోజుల్లోనే ఈ చిత్రం 200 కోట్ల వరకు వసూలు చేయడంతో.. ఫుల్ రన్‌లో కచ్చితంగా 250 నుంచి 275 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. తెలుగులో కూడా 5 రోజుల్లోనే ఈ చిత్రం 9 కోట్ల షేర్ వసూలు చేసింది.

Related posts