telugu navyamedia
సినిమా వార్తలు

భర్తతో కలిసి ఆలియా బేబీ బంప్‌తో..ఫోటోస్ వైర‌ల్ .

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌- రణ్‌బీర్‌ ‍కపూర్‌ ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. అంతేకాదు పెళ్లైనా రెండు నెలలకే ప్రెగ్నెన్సీని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. అమా బేబీ త్వరలో వస్తోంది అంటూ రాసుకున్నారు.

 అయితే ఆ సమయంలో ఆలియా పాల్గోన్నప్పడు కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లీకైన ఫొటోలలో ఆలియా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఆలియా తాజాగా తన పోర్చుగల్ షూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Photo : Twitter
అయితే గర్బం దాల్చినా షూటింగ్స్‌కి ఏమాత్రం బ్రేక్‌ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్‌లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్‌బీర్‌-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

 షూటింగ్ పూర్తయిన సందర్భంగా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రబృందానికి థాంక్స్ చెబుతూ ఆలియా ఆ ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది Photo : Twitter

ఓ సాంగ్‌ ప్రివ్యూ లాంచ్‌ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు. అయితే భర్తతో కనిపించిన ఆలియా భట్‌ తొలిసారిగా తన బేబీ బంప్‌ కనిపించేలా డ్రెస్‌ చేసుకుంది. ఇంతకుముందు డార్లింగ్‌ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆలియా బేబీ బంప్‌ కనపడకుండా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేది. కానీ ఈసారి మాత్రం బేబీ బంప్‌ను హైలైట్‌ చేస్తూ దుస్తులు ధరించింది.

 తన ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ రాకుండా కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తోందని తెలుస్తోంది ఆలియా. ఆలియా భట్..హలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి షూటింగ్ ఈ మధ్యే పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ను పోర్చుగల్‌లోని ఎడారిలో పూర్తి చేశారట. Photo : Twitter

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్‌ అవుతున్న ఈ జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్‌, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

Related posts