telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దుమ్ములేపుతున్న”వకీల్‌ సాబ్‌” టీజర్‌..

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్’ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ చిత్రంలో అంజలి, నివేత థామస్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. హిందీలో హిట్టయిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజ్‌ అయింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ టీజర్‌ ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ టీజర్‌లో పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ఫుల్‌ లాయర్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. చేతికి గడియారం పెట్టుకుని తనదైన స్టైల్‌లో కనిపించాడు పవన్ కళ్యాణ్‌. కోర్టులో వాదించడం తెలుసు.. కోర్ట్‌ తీసి కొట్టడం తెలుసు అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ ఓ రెంజ్‌కు వెళ్లింది.

Related posts