telugu navyamedia
రాజకీయ

ఉపరాష్ట్రపతి పీఠంపై సామాన్య‌ రైతు బిడ్డ : ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ విజయం..

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల అభ్యర్ధి జగదీప్ ధన్‌కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ గెలుపొందారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో జగదీప్‌కు 528 ఓట్లు, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు పోలయ్యాయి

ఈ నెల 11న భారత 16వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు జగదీప్ ధనకర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెంకయ్యనాయుడి స్థానంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహింబోతున్నారు.

జగదీప్ ధన్​ఖడ్​ స్వస్థలం రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామం. మే 18, 1951న సామాన్య రైతు కుటుంబంలో గోకల్‌చంద్‌, కేసరి దేవి దంపతులకు ఆయన జన్మించారు.

కితానా గ్రామంలో ప్రభుత్వ బడిలో  ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం 1962లో ఛిత్తోడ్‌గఢ్‌ సైనిక్‌ స్కూల్‌కు ఎంపికై, మెరిట్‌ స్కాలర్‌షిప్‌పై మళ్లీ ఐదో తరగతిలో చేరారు.  రాజస్థాన్‌ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

జైపుర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో బీఎస్సీ చేశారు. 1978-79లో రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తిచేశారు. సుదేశ్‌ ధన్‌కర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తే ఉన్నారు.

1979 నవంబర్‌ 10న రాజస్థాన్‌ బార్‌ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా సేవలందించారు. 1990 మార్చి 27న రాజస్థాన్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ అడ్వకేట్‌ హోదా పొందారు. 1990 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఉక్కు, బొగ్గు, గనులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ రంగాలపై జగదీప్‌ ధన్‌ఖడ్‌కు పట్టుంది.. వివిధ హైకోర్టుల్లోనూ వాదనలు వినిపించారు.. 

రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు.
.బంగాల్ గవర్నర్‌గా పనిచేశారు

Related posts