telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో హాలీవుడ్ మూవీలో గ్లోబల్ స్టార్

PC

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా భర్తతో కలిసి ఉంటున్నారు. ప్రియాంక చాలా గ్యాప్ తర్వాత ఇండియన్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తో ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే హాలీవుడ్ మూవీలో నటించింది. అయితే తాజాగా మరో కొత్త హాలీవుడ్ సినిమాలో మెరవనుందని సినీ వర్గాల టాక్.యాక్షన్ సిరీస్ మాట్రిక్స్ నుంచి త్వరలో నాలుగో పార్ట్ రానుంది. ఈ పార్ట్ లో ప్రియాంక చోప్రా కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లానా వాచోవ్స్కీ ఈ నాలుగో సిరీస్ కి దర్శకత్వం వహించనుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు ‘మ్యాట్రిక్స్ 4’ అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరపనున్నారు. 2021లో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Related posts