telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : వైశ్రాయ్ వీడియో లీక్…!

rgv lakshmis ntr movie trailer on 14 feb
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 22న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. తాజాగా ఈ సినిమాలో కీలకంగా చెప్పుకునే వైశ్రాయ్ హోటల్ కు సంబంధించిన ఆరు నిమిషాల నిడివి గల ఎపిసోడ్ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో కలిసి వైశ్రాయ్ హోటల్ వద్దకు చైతన్య రథం మీద తన అనుచరులతో వస్తారు. అయితే ముఖ్యమంత్రి అయినా… ప్రైవేట్ వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని సెక్యురిటీ చెప్తారు. బయట నుండి మైకులో ఎన్టీఆర్  బిగ్గరగా తన వాళ్లను అభ్యర్ధించడం, చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితోనో చెవిలో ఏదో చెప్పడం, వెంటనే ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం లాంటి సన్నివేశాలు చూపించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అక్కడికక్కడే కుప్పకూలి బాధ పడుతుండగా… బ్యాక్ గ్రౌండ్ లో “దగా దగా” అనే పాట మొదలవుతుంది. అయితే ఇప్పుడు వీడియోను ఆన్ లైన్ లో నుంచి తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వీడియోను డిలీట్ చేశారు కూడా.
ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో టీడీపీ అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపిస్తున్నారని, తొలివిడత పోలింగ్ ముగిసే వరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. వర్మ మాత్రం తాను చచ్చినా ఈ సినిమా విడుదల అవుతుందని, ఒకవేళ వెండి తెరపై విడుదల చేయనీయకపోతే యూట్యూబ్ లో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. తాజాగా “లక్ష్మీస్ ఎన్టీఆర్”పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ ఈ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశామని, ఎన్నికల కోడ్ ను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని, రాజకీయ పార్టీలకు వ్యతిరేఖంగా లేదా అనుకూలంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా రూల్స్ ప్రకారం ఇబ్బందులు తప్పవని రజత్ కుమార్ వివరించారు. దీంతో అసలు “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలవుతుందా ? లేదా ? అని వర్మ అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. మరి వర్మ ఏం చేస్తాడో చూడాలి.

Related posts