telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదరగొట్టిన తమన్నా ‘లెవెన్త్ అవర్’ టీజర్

 

15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. అప్పటినుండి మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. మిల్కీబ్యూటీ తమన్నా డిజిటిల్ ఫిలిమ్ ‘లెవెన్త్ అవర్’ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రవీణ్‌ సత్తారు రూపొందిస్తున్న ఈ కార్పోరేట్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏప్రిల్ 9న ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ ఫిల్మ్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో కార్పోరేట్ ఫర్మ్ ను రన్ చేసే యువతిగా తమన్నా నటిస్తోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శత్రువులకు తన శక్తి సామర్ధ్యాల మీద నమ్మకం లేకున్నా ఫైట్ చేసి ఎలా గెలుపు సాధించిందన్నదే ఈ డిజిటల్ ఫిల్మ్ కథాంశం. 

Related posts