telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు…!

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సాహో” టీజర్ విడుదలైన తర్వాత ‘వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. అభిమానుల్లో వీరాభిమానులు వేరయా అని ఓ డైహార్డ్ ఫ్యాన్ నిరూపించాడు. ఒరిస్సాకు చెందిన ఓ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అందరూ ఆ డైహార్డ్ ఫ్యాన్ వర్క్‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. ‘సాహో’ ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో బాలీవుడ్ ఖాన్స్ సినిమాలకు ధీటుగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Related posts