telugu navyamedia
సినిమా వార్తలు

65 సంవత్సరాల “రేచుక్క పగటిచుక్క”

నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించిన జానపద చిత్రం స్వస్తిశ్రీ పిక్చర్స్ వారి “రేచుక్క పగటిచుక్క” 14-05-1959 విడుదలయ్యింది.

ఎన్టీఆర్ గారి సోదరులు ఎన్.తివిక్రమరావు గారు నిర్మాతగా స్వస్తిశ్రీ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: నందమూరి త్రివిక్రమరావు, నిర్మాణ నిర్వహణ: అట్లూరి పుండరీకాక్షయ్య,
మాటలు,పాటలు: సముద్రాల రామానుజాచార్య (జూనియర్), ఫోటోగ్రఫీ: ఎం.ఏ.రెహమాన్, సంగీతం: టి.వి.రాజు, కళ: తోట వెంకటేశ్వరరావు, నృత్యం: వెంపటి సత్యం, ఎడిటింగ్: జి.డి.జోషి, అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి. రామారావు, షావుకారు జానకి, యస్.వి.రంగారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, మహంకాళి వెంకయ్య, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, రాజనాల, రేలంగి, గిరిజ, పద్మనాభం, చాయాదేవి, ఆర్.నాగేశ్వరరావు, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు గారి సంగీత నిర్వహణలో
“కాదా ఒౌనా ఏదని మీరు వాదులో వున్నారా”
“మనవి సేయవే మనసారా చెలికి నాదు ప్రేమ”
“నీవు నేనోయ్ నీదాన నేనోయ్”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ సినిమాని ఎన్టీఆర్ గారి సోదరులు నందమూరి త్రివిక్రమరావు గారు తెలుగు, తమిళ భాష లలో
సమాంతరంగా నిర్మించారు.

తెలుగు చిత్రాన్ని 14-05-1959 విడుదల కాగా తమిళం చిత్రం “రాజా సేవై” పేరు తో 02-10-1959 న విడుదల చేశారు.

ఈ చిత్రం జానపద సినిమాలకు భిన్నంగా మాయలు, మంత్రాలు లేకుండా కేవలం రాచరికపు ఛాయలుతో రాజు ను అమాయకుడు చేసి రాజ్యాన్నీ తమ హస్తగతం చేసుకుని దాయాదులు పరిపాలించి ప్రజలను దోచుకున్నారో చూపిస్తూ ఆ దుష్ట పాలనను,

అంతమొందించి ప్రజారంజక పాలనను హీరో చేపట్టటాన్ని దర్శకుడు కమలాకర కామేశ్వరరావు చక్కగా తీర్చి దిద్దారు.

ఎన్టీఆర్ గారు 1953 లో స్వంత నిర్మాణ సంస్థ “ఎన్.ఏ.టి.” బ్యానర్ ను నెలకొల్పి ‘”పిచ్చిపుల్లయ్య, తొడుదొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం'” వంటి చిత్రాలు నిర్మించగా,
ఈ “రేచుక్క పగటిచుక్క” సినిమాను మాత్రం స్వస్తిశ్రీ బ్యానర్ పై విజయా నాగిరెడ్డి గారితో కలిసి నందమూరి తివిక్రమరావు గారు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వం లో నిర్మించారు.

అయితే ఈ చిత్రం నిర్మాతలు ఆశించినంతగా విజయవంతం కాలేక పోయింది.
ఈ చిత్రం యావరేజ్ విజయాన్నీ మాత్రమే అందుకుని విజయవాడ తో పాటు మరి కొన్నీ కేంద్రాల్లో 50 రోజులు పైగా ప్రదర్శింపబడింది.

విజయవాడ – దుర్గా కళామందీర్ లో 56 రోజులు ఆడింది.
నటుడు నెల్లూరు కాంతారావు ఈ సినిమాలో వస్తాదు పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు.

Related posts