telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడిగా 15 ఏళ్ళ ప్రయాణం… ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను… : బోయపాటి

Boyapati

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. 2005లో “భ‌ద్ర” సినిమాతో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత తుల‌సి, సింహా, ద‌మ్ము, లెజెండ్‌, స‌రైనోడు, జ‌య‌ జాన‌కి నాయ‌క‌, విన‌య‌విధేయ‌రామ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఈ సందర్భంగా త‌న 15 ఏళ్ల ప్ర‌యాణం గురించి బోయ‌పాటి మాట్లాడుతూ ‘‘15 ఏళ్ల క్రింద ఇదే రోజు (2005 మే 12)న ద‌ర్శ‌కుడిగా నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. చాలా ర‌కాలైన ఎమోష‌న్స్‌, క‌ల‌లు, ప్యాష‌న్‌, ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే ల‌క్ష్యంతో నేను తొలి అడుగు వేశాను. చాలా జ్ఞాప‌కాలు, స‌వాళ్ల‌తో నేను ఊహించిన దానికంటే అందంగా ఇన్నేళ్ల ప్ర‌యాణం సాగింది. నా మార్గంలో నేను క‌లిసిన ప్ర‌తి వ్య‌క్తి వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. నేను నా సినిమాల్లో వ‌ర్క్ చేసిన నా యాక్ష‌న్ హీరోల‌కు, అంద‌మైన హీరోయిన్స్‌కు, విజ‌న్ ఉన్న నిర్మాత‌ల‌కు గొప్ప సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టుల‌కు, అద్భుత‌మైన ప్రేక్ష‌కుల‌కు, నా కుటుంబానికి, వీట‌న్నింటికీ మించి దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. మీకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. మీరు అందించిన స‌హ‌కారానికి, మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని నేను మ‌ర‌చిపోలేను. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌తో నా మూడో సినిమా ద్వారా మీ ముందుకు వ‌స్తున్నాను’’ అన్నారు.

Related posts