telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి “సీత” వచ్చేసింది

దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.  ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఈ సినిమా 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది.  అలాగే రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రను ఆలియా భట్ పోషిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళి ట్విట్ చేశారు. ఈ పోస్టర్ ఇలా వచ్చిందో లేదో అలా వైరల్ అయిపోతోంది. మరి కొద్ది గంటల్లోనే ఇది సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Related posts