telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్…

corona vairus

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 8.27 లక్షలు దాటిపోయాయి. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 1916 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 827882కి చేరింది. ఇందులో 22538 కేసులు యాక్టివ్ గా ఉంటె, 798625 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 13 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6719కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 106, చిత్తూరులో 121, తూర్పుగోదావరి జిల్లాలో 354, గుంటూరులో 179, కడపలో 141, కృష్ణాలో 68, కర్నూలులో 22, నెల్లూరులో 93, ప్రకాశంలో 178, శ్రీకాకుళంలో 68, విశాఖపట్నంలో 105, విజయనగరంలో 55, పశ్చిమ గోదావరిలో 426 కేసులు నమోదయ్యాయి.

Related posts