telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేలు యూటర్న్.. మణిపూర్ లో గట్టెక్కిన బీజేపీ!

bjp party

మణిపూర్ లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఆ వెంటనే రంగంలోకి దిగి అమిత్ షా, నడ్డాలు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆపై మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు.

కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్ తో కలిసి న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపీ తమ మద్దతును కొనసాగిస్తుందని హిమాంత స్పష్టం చేశారు.

తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నామని ప్రకటించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి విజయవంతమైంది.

Related posts