telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : పవన్

Janasena pawan comments Jagan

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ బోర్డు తప్పిదాల కారణంగా ఫెయిల్ అవడంతో మనస్థాపానికి గురై విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఇంటర్ బోర్డు అగమ్యగోచరంగా మార్చడం దారుణమని చెప్పారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.

విద్యార్థులపై అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడుతుండటాన్ని ఖండిస్తున్నామని పవన్ చెప్పారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ చేయాలని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన తల్లిండ్రులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ సూచించారు. విద్యార్థులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

Related posts