telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన రామ్ చరణ్

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో ఈ రోజు మెగాపవర్ స్టార్ రాంచరణ్ పాల్గొన్నారు. బాహుబలి ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాంచరణ్ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలు పెట్టిన నా స్నేహితుడు ప్రభాస్.. నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అని . నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద మనగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్  ఆలీయా బట్, దర్శకుడు రాజమౌళి,తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి
మొక్కలు నాటాలని కోరారు.

Related posts