telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రైవేటు డ్రైవర్లతో రోడ్డెక్కిన అద్దె బస్సులు

rtc protest started with arrest

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు శుక్రవారం అర్దరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో అన్ని జిల్లాల్లో వేలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రైవేటు డ్రైవర్లుతో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. పోలీసుల భద్రత మధ్య బస్సులను రోడ్డుపైకి తీసుకొస్తున్నారు.

మరోవైపు డిపోల ఎదుట ఆర్టీసీ ఐకాస నేతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా పరిగిలో పోలీసుల పర్యవేక్షణలో బస్సులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హకింపేట డిపోలో 136 బస్సులు, హయత్‌నగర్‌ డిపోలో 139 బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అధికారులు 92 బస్సులు నడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts