telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీపై దేశవ్యాప్తంగా ద్రుష్టి… బెట్టింగులే దానికి సాక్షి..

distict wise report on ap

ఒకపక్క దేశంలో విడతల వారీగా ఎన్నికలు జరుగుతుంటే.. మరోపక్క బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశం ద్రుష్టి అంతా ఆంధ్రరాష్ట్ర ఎన్నికల పైనే ఉంది. ఈ బెట్టింగులు చూస్తే అది ఒప్పుకోవాల్సిందే. ఈ దఫా ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ అని చెప్పాలి. రాజకీయ వర్గాలకు సైతం ఎవరిని విజయం వరిస్తుంది అనేది అర్ధం కాని అంశంగా వుంది . ఇటీవల ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తరువాత రానున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. కాగా ఏపీలో బెట్టింగ్ జరిగేది ప్రధాన పార్టీలైన టీడీపీ మరియు వైసీపీ లపై కాదు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేన పై కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు బెట్టింగ్ రాయుళ్ళు . జనసేన పార్టీపైన కూడా కోట్లల్లో బెట్టింగ్ జరుగుతుందని సమాచారం. ఈసారి జరిగిన ఎన్నికల్లో పవన్ గాజువాక , భీమవరం నుండి రెండు స్థానాల నుండి పోటీ చేశారని సంగతి అందరికీ తెలిసిందే.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి గెలుస్తారనేది మొదటి పోటీ.ముందుగా ఒక్కస్థానానికే పవన్ పరిమితం అవుతాడా లేక రెండు స్థానాల్లో విజయం సాధిస్తాడా అనే అంశంపై బెట్టింగ్ ప్రధానంగా జరుగుతుంది. ఇక గెలుపొందితే ఆ స్థానాల్లో పవన్ ఎంత మెజారిటీ సాధిస్తాడు అనే అంశంపై విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంది. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది రెండవ అంశం. అయితే అది కూడా 20 స్థానాలకే పరిమితం అవుతుందా లేక ఎక్కువ స్థానాలు సాధించుకుంటారా అనే అంశంపైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది . ఇక మూడోది రాష్ట్రంలో హంగ్ వస్తుందా రాదా, జనసేన కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది కూడా బెట్టింగ్ రాయుళ్ళకు బెట్టింగ్ పెట్టే అంశం.

ఏపీలో జనసేన హంగ్ తో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అభిమానులు బెట్టింగ్ కాస్తుంటే, అటువంటి అంశానికి తావులేదని మరొకవర్గం బెట్టింగ్‌ పెడుతుంది. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పార్టీ అయిన జనసేనపై కూడా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వందల కోట్ల బెట్టింగ్ లు అటు ప్రధాన పార్టీల మీదే కాదు జనసేన పార్టీపైన కూడా పెడుతుండటం విశేషం.

Related posts