telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్రెడిట్​ కార్డులు వినియోగించడం లేదా.. అయితే మీకు మంచిదే…!

indian credit and debit cards hacked

క్రెడిట్​ కార్డు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని… క్రెడిట్​ కార్డుకు అలవాటు పడిన వాళ్ళు అవసరం ఉన్నా, లేకపోయినా అదేపనిగా షాపింగ్​ చేస్తుంటారని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా, మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ‘‘కార్డు ఉపయోగించినప్పుడు ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. కోవిడ్–19 భయంతో నగదు లావాదేవీలు తగ్గిపోవడంతో పాటు కార్డు చెల్లింపులు పెరిగిపోవడంతో అన్ని రకాల బిల్ పేమెంట్స్ వరకు ఎక్కువగా కార్డులు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. అంతే కాక క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు కూడా కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్​ని ఏర్పరుస్తుందని నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్​ కార్డు వాడకం మెదడుకు కొకైన్​ మాదిరిగానే కిక్​ ఇస్తుందని అధ్యయనం పేర్కొంది. ఇవే కాక క్రెడిట్ కార్డులు చెల్లింపులతో వచ్చే రివార్డు పాయింట్లు, ఆఫర్లు వాడకం దారులను ఇంకా ఎక్కువ కొనుగోలు చేసేలా చేస్తాయట. అయితే మీరు కూడా జాగ్రత్త.. వీలైనంత తక్కువగా క్రెడిట్​ కార్డు వాడండి… కుదిరితే అసలు వాడకుండా ఉండండి.

Related posts