telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పశ్చిమ బెంగాల్ సంపూర్ణ లాక్ డౌన్…

మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రలో లాక్ డౌన్ విధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు కొసాగుతుండటంతో… తాజాగా మే 30 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది. తాజాగా బెంగాల్ లో 20,846 మందికి కరోనా సోకగా.. 186 మంది ప్రాణాలు వదిలారు. అయితే అక్కడ ఈ మధ్యే వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన… ఆవిడ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Related posts