ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను గుంటూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం కోడెల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే కోడెల చికిత్స పొందుతున్న ఆసుపత్రికి టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు వెళ్లారు.
కోడెల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కోడెల అనారోగ్య పరిస్థితికి వైసీపీ ప్రభుత్వ ఒత్తిళ్లే కారణమని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.