telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో 31 చైనా కంపెనీలపై ఆంక్షలు విధించిన ట్రంప్…

trump usa

యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.  ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం కరోనా.  చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్నది.  ముఖ్యంగా అమెరికా.  అమెరికాలో ఇప్పటికే కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  దేశంలో కరోనా వ్యాపిస్తున్న సమయంలో ట్రంప్ కరోనా మహమ్మారి చైనా నుంచి వచ్చిందని, చైనా వైరస్ అని బాహాటంగా విమర్శలు చేశారు.  వీలు దొరికినప్పుడల్లా చైనాపై నిప్పులు చెరిగారు.  చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేలోపుగా చైనాకు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.  అనుకున్నట్టుగానే ట్రంప్ తాజాగా చైనాకు చెందిన 31 కంపెనీలపై ఆంక్షలు విధించారు. అమెరికాలోని చైనా కంపెనీలోని చైనా టెలికం కార్పొరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హిక్ విజన్ వంటి ప్రముఖ టెలికం సంస్థలు కూడా ఉన్నాయి.  చైనా తన సైనిక, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాడానికి అమెరికా పెట్టుబడుల్ని దుర్వినియోగం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు.  చైనా కంపెనీలపై విధించిన నిషేధం జనవరి 11, 2021 నుంచి అమలులోకి రాబోతున్నది.  మరికొన్ని చైనా కంపెనీలపై కూడా అమెరికా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు.  

Related posts