యురేనియం ప్రాజెక్టు పాపం అటవీశాఖ మాజీ మంత్రి జోగురామన్నదేనని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో సోయం మాట్లాడుతూ.. యురేనియం ప్రాజెక్టు విషయంలో జోగు రామన్న జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
నక్సలైట్ ప్రాంతాల నిధులతో టీఆర్‌ఎస్ నేతల పొలాలకు రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. పదివేలు ఇస్తే ఆదివాసీలు అమ్ముడుపోరని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దళారుల చేతుల్లో పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు ఆదివాసీల పోరాటం ఆపేది లేదని శపథం చేశారు. పదివేలు ఇచ్చుడు కాదు.. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతానని వ్యాఖ్యానించారు.
రాత్రికి రాత్రి సర్దుకుని వచ్చింది తమరే కదా చంద్రం సారూ: విజయసాయిరెడ్డి