telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

సర్వేంద్రియానాం నయనం ప్రదానం.. వాటి ఆరోగ్య పరిరక్షణ ఇలా..

tips to make eyes healthy on work also

ఒకవైపు కంప్యూటర్, మరో వైపు సెల్ ఫోన్.. ఈ రెంటిని గంటల తరబడి చూసి చూసి.. కళ్ళు అలసిపోతున్నాయి. అయినా పట్టించుకోకుండా పని పని అని ఉన్న కళ్ళను నిర్లక్ష్యం చేస్తూ, వాటి విలువను మరిచిపోతున్నాము. అవి లేని వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుంటే, వాటిని ఎలా పరిరక్షించుకోవాలో తెలుస్తుంది. ఇక పని ఒక పక్క, కాలుష్యం మరోపక్క కంటి ఆరోగ్యానికి పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఈ సమస్యలకు ఒక్కటే పరిష్కారం. పని వేళల్లో ప్రతి గంటకు ఒకసారి కంటి వ్యాయామం వంటివి చేస్తూ, అటు ఆరోగ్యాన్ని, ఇటు ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలి.

ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్నవారి కంటి నుండి నీరు కారడం, కళ్లమంట వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఈ సమస్యలతో కళ్లు కాంతిని కోల్పోతాయి. కంటికి తగినంత విశ్రాంతి లేకపోతే కూడా కళ్లు అలసటగా ఉంటాయి. దానివలన కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..

* కంటి మంటలను తగ్గించాలంటే… గుడ్డు తెల్ల సొనను తీసుకుని అందులో స్పూన్ మోతాదులో తేనె కలిపి కళ్లపై రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.

* గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపుకుని అందులో మెత్తటి బట్టను ముంచి దానిని కళ్ల మీద వేసుకుని ఓ అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే కంటి అలసట తగ్గుతుంది.

* కళ్లు విపరీతంగా మండుతుంటే.. ఐస్‌క్యూబ్స్‌తో కళ్లపై మర్దన చేసుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు అలానే చేయాలి. ఇలా చేస్తే కళ్ల ఒత్తిడి తగ్గుతుంది.

* ధనియాలు కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్లాస్ నీటిలో 2 స్పూన్ల ధనియాలు వేసి రాత్రంత నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిగి తాగితే మంచిది.

ఉద్యోగంలో లేదా సెల్ ఫోన్ వాడిప్పుడు కూడా అదేపనిగా గంటలతరబడి తీక్షణంగా చూస్తూ ఉండకుండా, గంట లేదా గంటన్నరకు ఒకసారి కాసేపు కళ్ళు అరచేతులతో మూసి, శ్వాసపై ద్యాస ఉంచండి, ఇలా రెండు నిముషాలు చేస్తూ మీ పని మీరు చేసుకుంటుందండి.. చాలు. మీ కంటి ఆరోగ్యం మీ చేతులలోనే.

Related posts