telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

తోటి విద్యార్థిని చంపి.. తనకు తాను కాల్చుకున్నాడు

gun fire

రష్యాలో ఓ విద్యార్థి తరగతి గదిలో కాల్పులతో వీరంగం సృష్టించాడు. విద్యార్థి జరిపిన కాల్పుల్లో తోటి విద్యార్థి మృతి చెందగా..మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బ్లాగోవెశ్ చెన్‌స్కు పట్టణంలో నిర్మాణరంగానికి చెందిన కాలేజీలో ఈ దారుణం వెలుగుచూసింది.

సమాచారమందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన విద్యార్థిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో..నిందితుడు కోడా తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతి చెందిన విద్యార్థి, గాయపడ్డ విద్యార్థులంతా 17-20 మధ్య వయస్సువారే. తరగతి గదిలో 20 మంది విద్యార్థులున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts