telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించారు: పుష్ప శ్రీవాణి

pushpa sreevani

దిశ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా కొందరు ప్రకటనలకే పరిమితమైపోతే సీఎం జగన్ మాత్రం దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ చట్టాన్ని ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా సాధారణ కుటుంబానికి చెందిన మహిళగానూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాని అసెంబ్లీలో అన్నారు. జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళనైన నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

నిత్యం నరకాన్ని అనుభవిస్తోన్న మహిళా లోకానికి ఈ చట్టంనమ్మకాన్నిచ్చిందన్నారు. ఈ చట్టం వల్ల న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లకు గంతలు తెరుచుకుని ఆదిపరాశక్తిగా మారి.. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షిస్తుందన్న నమ్మకం కలిగిందని చెప్పారు. రాక్షసుల చేతిలో బలైపోతోన్న మహిళల్లో ఈ చట్టాన్ని నమ్మకాన్ని కల్గిస్తోందన్నారు.

Related posts