telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాని టక్ జగదీష్ టీజర్ అప్డేట్…

Nani

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం నాచురల్ స్టార్ తన తాజా చిత్రం టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వానా దర్శకత్వంలో సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, రొమాన్స్ జానర్స్‌లో తెరకెక్కుతోంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీన్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇతర సినిమాల నుండి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా నాని కూడా చేరనున్నారు. నాని టక్ జగదీష్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ అలాగే టీజర్ వచ్చేది ఎప్పుడో రేపు చిత్రబృందం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన హింట్ ఇస్తూ నాని తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు. ఇక ఈ మధ్యే ఈ సినిమా నుండి వచ్చిన ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ లిరికల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. ఇక వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts