telugu navyamedia
రాజకీయ వార్తలు

పేదలకు సంపన్నులు సాయం చేయాలి: అమిత్ షా

amith shah bjp

వచ్చే నెల 3 వరకు కేంద్రం లాక్ డౌన్ ను పొడగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా ట్విటర్ లో స్పందించారు. దేశ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అందరికీ సరిపడా ఆహార నిల్వలు, ఔషధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

దేశంలోని సంపన్నులకు అమిత్ షా ఓ విన్నపం చేశారు. దేశంలోని పేదలకు సంపన్నులు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని షా పేర్కొన్నారు. అందరూ ముందుకు వచ్చి సేవ చేయాలని కోరారు. లాక్ డౌన్ పొడిగింపుతో భయపడాల్సిన అవసరం లేదని హోంమంత్రిగా తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు విధులను నిర్వహిస్తున్నారని చెప్పారు. వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని కొనియాడారు.

Related posts