ములాయంసింగ్ యాదవ్ వైద్య పరీక్షలను సంజయ్ గాంధీ ఆస్పత్రిలోనే చేయించుకుంటారు. బుధవారం కడపులో నలతగా అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. కడుపునొప్పి సాధారణంగా వచ్చేదేనా ? లేక ఇతర సమస్యల వల్ల వస్తోందా అనే అంశాలపై వైద్యులు పరీక్షలు చేయిస్తున్నారు. సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి ములాయం వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం, ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అధికారంలోకి తీసుకొచ్చారు. యూపీ సీఎంగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో నెలకొన్న గొడవలతో పార్టీ కుమారుడు అఖిలేశ్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తండ్రి, కొడుకులు మధ్య సఖ్యత లేదు. తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ పక్కనపెట్టడంతో ములాయం ప్రతిస్పందించారు. అఖిలేశ్‌ను తప్పుపట్టారు.